విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 108 వాహనాల ప్రారంభించడానికి వేదిక ఏర్పాటు చేయడంతో ప్రకాశం జిల్లా నుంచి ట్రాఫిక్ మళ్లించారు. ఒంగోలు మండలం త్రోవగుంట నుంచి బాపట్ల మీద నుంచి, కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ వరకు కొత్తగా నిర్మించిన 216 జాతీయ రహదారి మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. భారీ వాహనాలన్నీ ఈ రహదారి మీదుగా మళ్లించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. త్రోవగుంట నుంచే ట్రాఫిక్ నిలిచిపోవడం తో ముందుకు వెళ్లలేక వాహనా చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
16వ నెంబరు జాతీయ రహదారిలో వన్ వే కావడం వల్ల ఎంతటి భారీ వాహనాలు రాకపోకలు సాగించిన ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ రహదారి భారీ వాహనాలకు అనుగుణంగా లేక పోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. హనుమాన్ జంక్షన్ నుంచి త్రోవగుంట వైపుకు భారీ వాహనాలు ఎదురెదురుగా రావడంతో తప్పించుకోలేక వాహనాలు ఇరుక్కుపోయాయి.
ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కొన్ని వాహనాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. భారీ వాహనాలు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే వాహనాలదారులు ఇబ్బంది పడ్డారు. చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు , పర్చూరు తదితర మండలాల ప్రజలు రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇదీ చదవండి: కరోనాతో దేశంలో ఒక్కరోజే 507 మంది మృతి