ETV Bharat / state

AP Crime News: కడప జిల్లా తెలుగుగంగ కాల్వలో రెండు మృతదేహాలు లభ్యం

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ప్రమాదాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నామ్ రహదారిపై లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. విశాఖలోని సత్యం కూడలి వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది. అప్పు తీర్చలేదని బైక్​కు నిప్పు పెట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కడప జిల్లా తెలుగుగంగ కాల్వలో రెండు మృతదేహాలు లభ్యం కాగా, చంద్రగిరి మండలంలో పల్సర్ స్కూటర్ దహనం కలకలం రేపింది.

AP Crime News
కడప జిల్లా తెలుగుగంగ కాల్వలో రెండు మృతదేహాలు లభ్యం
author img

By

Published : Mar 17, 2022, 8:56 AM IST

Updated : Mar 18, 2022, 2:44 AM IST

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె తెలుగుగంగ కాలువలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరు బద్వేలుకు చెందిన షేక్‌ పీరాసాహెబ్‌గా గుర్తించారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నామ్‌ రహదారిపై రామాంజనేయ పురం వద్ద.. తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు హైదరాబాద్ నుంచి అద్దంకి వైపు వెళ్తుండగా.. రామాంజనేయపురం దగ్గరికి వచ్చేసరికి వెనుక నుంచి లారీ ఢీకొట్దింది. ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

బైక్ లారీ ఢీ.. విద్యార్థిని మృతి

విశాఖలోని సత్యం కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్న ఘటనలో కళాశాలకు వెళ్తున్న ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సింథ్యా సమంతానియాగా గుర్తించారు.

మహిళపై వ్యక్తి దాడి..

గుంటూరు మిర్చి యార్డు సుబ్బారెడ్డినగర్‌లో మహిళపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. మహిళపై దాడిచేసిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి నల్లపాడు పోలీసులకు అప్పగించారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ.. 5లక్షలు అపహరణ

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని కోదాడ క్రాస్​ రోడ్డులోని శాంతినగర్​లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి జరిగింది. దాదాపు రెండు లక్షల నగదు, 5 గ్రాముల బంగారం, కొన్ని వెండి వస్తువులు చోరీ జరిగాయి. ఇంటికి తాళం వేసి పొరుగూరికి వెళ్లగా గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని పక్కింటి వారు గమనించి చోరీ జరిగిందని పోలీసులకు, యజమానులకు సమాచారమిచ్చారు. యజమాని కనపర్తి లక్ష్మీ ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. జగ్గయ్యపేట సీఐ పుల్లా చంద్రశేఖర్, పట్టణ ఎస్సై బీవీ మారావు కేసు దర్యాప్తు చేపట్టారు.

అప్పు తీర్చలేదని బైక్​కు నిప్పు పెట్టిన యువకుడు

3వేల రూపాయలు అప్పు తీర్చలేదని బైకుకు ఓ యువకుడు నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి కాలనీలో జరిగింది. బాధితుడు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేట్టారు.

13కేసుల్లో నిందితులైన నలుగురు యువకులు అరెస్ట్​...

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి సమక్షంలో 13 కేసుల్లో నిందితులైన నలుగురు యువకులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వీరి నుంచి 15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ఐదు ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు మాధవ రెడ్డి వివరించారు. తర్వాత వారిని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వీరభద్ర పురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేల్పూర్ వైపు నుంచి తణుకు వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని, పక్కన సైకిల్ పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ సంఘటనలో సైకిల్ పై వెళ్తున్న తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వృద్ధుడు నూనె సత్యనారాయణ (74) అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని తణుకులోని జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తణుకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరాలించారు. ఈ రోజు ఉదయం సంతేకుడ్లూరు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటన స్థలంలో మల్లికార్జున అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మల్లికార్జున తో పాటు మరో నలుగురికి గాయాలు అయ్యాయని ఇస్వీ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రగిరి మండలంలో కలకలం రేపిన పల్సర్ స్కూటర్ దహనం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలో పల్సర్ స్కూటర్ దహనం కలకలం రేపింది. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో ప్రైవేటు వెంచర్లో నిర్మానుష్యమైన ప్రదేశంలో పల్సర్ 220 స్కూటర్ను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. పశువు కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు స్కూటర్ దహనమైన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సంఘటన పది నుంచి పదిహేను రోజులకు ముందు జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దహనం చేసిన అతి సమీపంలోనే మూడు గోనె సంచులులలో రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించారు. స్కూటర్ కి ఉన్న నెంబర్ ప్లేట్ ఆధారంగా ఏర్పేడు మండలం గాజులమండ్యంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చంద్రగిరి సిఐ శ్రీనివాసులు తెలిపారు.

లారీని ఢీకొట్టిన బైకు.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి.

విజిలెన్స్ దాడులు

గుంటూరు జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గుంటూరు నగరం, చినకాకాని, మంగళగిరి, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో వంటనూనెలు, వంటనూనె గింజలు అక్రమంగా నిల్వచేసిన గోదాంలపై దాడులు నిర్వహించారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు అమ్ముతున్న 15 దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

దానిమ్మ తోట దగ్ధం

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి హిరేహాల్ మండలం గోడిసెలపల్లి గ్రామానికి చెందిన గాజుల రాదమ్మ అనే రైతుకు చెందిన దానిమ్మ తోట అగ్నికి ఆహుతైంది. రూ.8 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

కత్తులతో దాడి..

విజయనగరం జిల్లా రంగిరీజు వీధిలో ఓ వ్యక్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రతన్ దేవాస్ అనే బంగారు ఆభరణాలు తయారుచేసే వ్యాపారిపై.. అదే ఏరియాలో బంగారు ఆభరణాలు తయారు చేసే భరత్ కుమార్ అనే మరో వ్యాపారి దాడి చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ రాత్రి షేక్ అలీ ఖాన్,జొన్నాడ రవి కుమార్,పవన్ కల్యాణ్ అనే ముగ్గురు వ్యక్తుల సహాయం తీసుకొని దాడి చేయించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : నెల్లూరు పోలీసుల దాష్టీకం.. అన్నదాతపై విరిగిన లాఠీ !

Last Updated : Mar 18, 2022, 2:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.