ఎస్బీఎస్(SBS), ఎస్ఎల్ఎస్(SLS) ప్రాంతాల్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 11 ప్లాట్‌ఫారాల్లో మార్చి 15 నుంచి పొగాకు బోర్డు కొనుగోళ్లు చేపట్టింది. ఈలోగా కర్ఫ్యూ విధించగా.. ప్లాట్‌ఫారాలను మూసివేశారు. గతేడాది 83 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు అనుమతించగా..ఈసారి అధిక వర్షాలు, మార్కెటింగ్ సమస్యతో 66 మిలియన్ కిలోలకే పరిమితం చేశారు. కొనుగోళ్లు పునఃప్రారంభమైనా.. రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. నాణ్యమైన దిగుబడి రావటం వల్ల.. మంచి ధర వస్తుందని పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ప్రతి ఏడాదికి భిన్నంగా ఒకరిద్దరు తప్ప బయ్యర్లు పోటీపడట్లేదని రైతులు వాపోతున్నారు. వర్షాలు, అధిక కూలి మరింత దెబ్బతీశాయంటున్నారు.
బయ్యర్లు రాకపోవడం వల్ల మధ్య రకం పొగాకు ధర తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. అవన్నీ తలకిందులయ్యాయని రైతులు దిగులు చెందుతున్నారు.
ఇదీ చదవండి: