ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఉప్పుమాగులూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో దొంగతనం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ తాళాలు పగలగొట్టి పాఠశాలలోని 12 ల్యాప్టాప్లను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు బల్లికురవ పోలీస్ అధికారులకు తెలియజేశారు. వీటి విలువ సుమారు నాలుగు లక్షల వరకు ఉంటుందన్న పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు