ETV Bharat / state

కరోనాతో మృతి చెందిన వ్యక్తి ఇంట్లో చోరీ.. నగదు, నగలు మాయం - అమ్మవారిపాలెంలో దొంగతనం వార్తలు

ఆ ఇంటి పెద్దకు కరోనా సోకింది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు చెన్నైకు తీసుకెళ్లారు. 18 రోజులపాటు అందరూ అక్కడే ఉన్నారు. అయినా ఆ మహమ్మారి తగ్గకపోగా ఇంటి యజమానిని బలితీసుకుంది. అక్కడే అంత్యక్రియలు, మిగిలిన క్రతువులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగివచ్చారు. కుటుంబ పెద్ద చనిపోయాడనే బాధతో వచ్చినవారికి ఇక్కడ మరో షాక్ తగిలింది. ఇంటిని మొత్తం దొంగలు దోచుకెళ్లిపోయారు.

theft in ammavaripalem
అమ్మవారిపాలెంలో దొంగతనం
author img

By

Published : Sep 24, 2020, 2:22 PM IST

కరోనాతో మృతిచెందిన వ్యక్తి ఇంట్లో దొంగలు పడి నగదు, నగలు అపరించుకుపోయారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం అమ్మవారిపాలేనికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. అతని చికిత్స కోసం కుటుంబసభ్యులు చెన్నై తీసుకెళ్లారు. 18రోజులపాటు మహమ్మారితో పోరాడి ఆయన చనిపోయారు. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేసి తిరిగి ఇంటికి వచ్చారు. బాధాతప్తహృదయంతో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఇంటిని చూసి హతాశులయ్యారు.

ఇంటి తాళాలు తీసి ఉండటాన్ని గమనించారు. ఇంట్లో పరిసరాలు చూస్తే చోరీ సంగతి అవగతమైంది. బీరువా పగులగొట్టిన దుండగులు రూ. 8 లక్షల నగదుతోపాటు, నగలు దోచుకెళ్లారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలే కుటుంబ పెద్ద మరణంతో బాధపడుతున్న వారికి ఇంట్లో జరిగిన దొంగతనం మరింత కుంగదీసింది.

ఇవీ చదవండి..

ఈ కచ్చిలి చేప ఖరీదు .. రూ. 1.70 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.