ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడులోని పోలేరమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఉదయం పూజ చేసేందుకు వచ్చిన పూజారి.. తలుపులు తీసి ఉండటాన్ని గమనించి ఆలయ కమిటీకి తెలియజేశారు. దేవాలయంలో హుండీ, సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్, మానిటర్లను సైతం ధ్వంసం చేసి ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఆలయంలోని బీరువాను పగలకొట్టి విలువైన వస్తువులను దుండగులు అపహించారని పూజారి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న కారంచేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో తరచూ దేవాలయాల్లో చోరీలు జరుగుతూనే ఉన్నాయని.. పోలీసులు రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు