ప్రకాశం జిల్లాలో రెండో విడత స్థానిక ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని 75 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: రాజ్యసభలో కనకమేడల ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల తొలగింపు