ప్రకాశం జిల్లాలో కరోనాతో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ పరారయ్యాడు.. ఒంగోలు రిమ్స్‌లో కరోనా జనరల్ వార్దు నుంచి తప్పించుకొని పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నెల 14న టంగుటూరు మండలం మర్లపాడు వద్ద నాగరాజు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అతని భార్య కూడా కొద్దీ సేపట్లోనే ఆత్మహత్య చేసుకుంది. నాగరాజు హత్యకు కారకులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏ1గా ఉన్న పులి శ్రీనివాసులు, అతని స్నేహితుడు విజయ్‌లకు కొవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో.. వారిని ఒంగోలు రిమ్స్‌లో చేర్పించి చికత్స అందిస్తున్నారు. విజయ్ అనే ఖైదీ ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. కరోనా బాధితుడు కావటంతో అధికారులు వెతుకులాట ప్రారంభించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే అతడు పరారయ్యారని పలువురు విమర్శిస్తున్నారు.
ఇవీ చూడండి… 'మహిళా సాధికారత కోసం సీఎం ఎంతో చేస్తున్నారు..'