ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు కిరణ్ కుమార్ మృతికి కారణమైన పోలీసులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎస్సీ, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ముక్కోణపు పార్క్ సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. మృతికి కారకులైన పోలీసులపై అట్రాసిటీ కేసుతో పాటు హత్య నేరం కింద కేసు నమోదు చేసి.. కిరణ్ మృతిపై జ్యూడిషియల్ న్యాయ విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీయం చీరాల ఏరియా కార్యదర్శి బాబురావు, కేవీపీఎస్ నాయకుడు కుర్రా రామారావు, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.
'ఎస్సీ యువకుడి మృతికి కారణమైన పోలీసులను తొలగించాలి' - కిరణ కేసు
ప్రకాశం జిల్లా చీరాలలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ముక్కోణపు పార్క్ సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎస్సీ యువకుడు కిరణ్ కుమార్ మృతికి కారణమైన పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.