ETV Bharat / state

డోర్నాలలో శ్రీశైలం మార్గం మూసివేత

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లన్న సన్నిధికి భక్తులు వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ప్రకాశం జిల్లా డోర్నాల వద్దనే పోలీసులు.. భక్తులను నిలిపేస్తున్నారు.

The police are stopping at Dornala from going to the devotees of Srisailam
డోర్నాలలో పోలీసులు
author img

By

Published : Mar 21, 2020, 12:49 PM IST

డోర్నాలలో శ్రీశైలం వెళ్లే వాహనాలకు బ్రేక్

శ్రీశైలం మల్లన్న సన్నిధికి భక్తులు వెళ్లకుండా ప్రకాశం జిల్లా డోర్నాల వద్దనే పోలీసులు నిలిపేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులనూ పెద్దదోర్నాల వద్దే అడ్డుకుంటున్నారు. స్థానిక అటవీ శాఖ చెక్ పోస్టు వద్ద ఎస్సై రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ప్రైవేట్ వాహనాలను వెనక్కి పంపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

కరోనాపై చినగంజాంలో అధికారుల అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.