ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం సెంటర్లో మస్తాన్ అనే వ్యక్తిపై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో బాధితుడి చేతిపై, తలపై తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు. దాడికి పాత కక్షలే కారణమని బాధితుడు చెప్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సాయంత్రం రద్దీగా ఉన్న ఈపురుపాలెం సెంటర్లో కత్తితో దాడి జరగటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:భార్యను చంపేసి సహజ మృతిగా నమ్మించాడు... ఏడాది తర్వాత దొరికిపోయాడు