ETV Bharat / state

నడుచుకుంటూ వెళ్తూనే వ్యక్తి మృతి.. అసలేమైందంటే? - మార్కాపురం తాజా వార్తలు

Man Died While Walking: నడుచుకుంటూ వెళ్తూనే.. హఠాత్తుగా పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం మీదపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది.

Man Died While Walking
నడుచుకుంటూ వెళ్తూ వ్యక్తి మృతి
author img

By

Published : Mar 20, 2022, 2:51 PM IST

Man Died While Walking: నడుచుకుంటూ వెళ్తూ.. ఉన్నట్టుండి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలోని భగత్ సింగ్ కాలనీలో జరిగింది. రాచర్ల మండలం రామాపురానికి చెందిన రామలింగారెడ్డి రెండు రోజుల క్రితం మార్కాపురంలో నివాసముంటున్న కుమారుడి వద్దకు వచ్చాడు. సాయంత్రం సమయంలో తలనొప్పిగా ఉందని మాత్రల కోసం బయటకు వచ్చాడు.

మందులు తీసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఉన్నట్టుండి.. రోడ్డు పక్కన ఆగివున్న ద్విచక్ర వాహనంపై పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ.. రామలింగారెడ్డి అప్పటికే మృతి చెందాడని గ్రహించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీసీ ఫుటేజీ పరిశీలించి ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులు తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న మృతుని కుమారుడు.. ఘటనా స్థలానికి చేరుకొని, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే తన తండ్రి మృతి చెందాడని పోలీసులకు తెలిపాడు.

ఇదీ చదవండి: Save Sparrow: చిన్ని ప్రాణికి పెద్ద కష్టం.. కాపాడేందుకు చిన్న ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.