15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా(rains in prakasam district)లో జనజీవనం అస్తవ్యస్తమయింది. చీరాల పట్టణంలోని లోటట్టు ప్రాంతాలతో పాటు ఈపురుపాలెం చేనేత కాలనీలు నీటమునిగాయి. నీళ్లల్లోనే రాకపోకలు సాగిస్తుండటంతో... వ్యాధులు ప్రభులుతాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
తోటివారిపాలెంలోని చంద్రమౌళీ చేనేత కాలనీ నీటమునిగింది. కాలనీలోని 123 ఇళ్లలోని వరద నీరు ముంచెత్తింది. కాలనీలో 20 చేనేత మగ్గాలు వర్షానికి తడిసిపోయాయని.. ఒక్కో మగ్గానికి రూ.5-7 వేలు విలువ చేసే నూలు తడిపోయిందని చేనేత కార్మికులు(Handloom workers) ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ అధికారులు ఇటువైపు రాలేదని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి