20 ఏళ్ల నుంచి వీఆర్ఏగా పని చేస్తన్న తనతో తహసీల్దార్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రకాశం జిల్లాలో ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని బోరున విలపించింది.
క్రిస్మస్ పండుగ రోజు తోటి సిబ్బందితోపాటు తహసీల్దార్‌ను బాధితురాలు విందుకు ఆహ్వానించింది. విందుకు తహసీల్దార్ రాలేదని బాధితురాలు వివరించింది. ఈ ఘటన అనంతరం జనవరి 4వ తేదీన మండల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తహసీల్దార్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపిస్తుంది.
ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ అడగ్గా తనపై వీఆర్ఏ చేస్తున్నవన్నీ అసత్యాలని కొట్టిపారేశారు. ఎటువంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.
ఇదీ చదవండి: తెలివిగా కాజేశాడు... పోలీసులకు చిక్కాడు