ప్రకాశం జిల్లాలో పేదల ఇళ్ల పట్టాలు కోసం కేటాయించిన భూములపై ఉన్న వివాదాన్ని తొలగించేందుకు మైనింగ్ లీజ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు, టంగుటూరు మండలాల మధ్య ఎర్రజర్ల ప్రాంతంలో 1300 ఎకరాలు భూముల్లో ఖనిజాలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఈ భూమిని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు లీజుకు ఇచ్చింది. సర్కారు తమకు ఇచ్చిన భూమిని ..జింపెక్ అనే సంస్థకు ఖనిజాభివృద్ధి సంస్థ కట్టబెట్టింది. ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాంతంలో ఆ సంస్థ మైనింగ్ నిర్వహించలేదు. ఖాళీగా ఉన్న భూములను జగనన్న కాలనీకి ఇటీవలే సర్కారు కేటాయించింది. సుమారు 650 ఎకరాల్లో 20వేల ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది.
ప్లాట్ల విభజన పూర్తి చేసి.. హద్దులూ నిర్ణయించింది. పట్టాల పంపిణీయే తరువాయి అనుకున్న సమయంలో కొంతమంది దీనిపై కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కారణంగా.. సదరు ప్రైవేటు సంస్థ లీజు కూడా రద్దైంది. కానీ కోర్టులో కేసు ఉండడం వల్ల పట్టాలు పంపిణీని ప్రభుత్వం ఎప్పుడు చేస్తారోనని పేదలు ఎదురు చూస్తున్నారు.
ఇదీ చదవండి: