ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరులో దేవాలయ భూముల కౌలు వేలం వ్యవహారం.. వివాదానికి దారితీసింది. సంతరావూరుకు చెందిన కనకనాగవరపు అమ్మవారి దేవాలయానికి సంబంధించిన 27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కౌలు పద్దతిలో వేలం వేయటానికి అధికారులు వచ్చారు. అమ్మవారి ఆలయం మాత్రం వేటపాలెం మండలం రామన్నపేటలో ఉంది.
అయితే ఆలయానికి సంబంధించి అనాదిగా తమ గ్రామానికి చెందినవారితో పాటు రామన్నపేటకు చెందిన వారు ఆలయ కమిటీ ఏర్పాటు చేసేవారని.. ప్రస్తుతం తమను పక్కనపెట్టి రామన్నపేటకు చెందిన వారినే కమిటీలో నియమించారని సంతరావూరు గ్రామస్థులు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాకే.. భూములకు కౌలు వేలం నిర్వహించాలని తేల్చి చెప్పారు. తమకు న్యాయం చేసేవరకు కౌలు వేలం నిర్వహించరాదన్నారు. చేసేది లేక దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ.. ప్రక్రియను వాయిదావేశారు.
ఇదీ చదవండి:
'ఎన్నికల్లో మీ పార్టీ కొమ్ముకాశాం.. న్యాయం చేయండి'.. మంత్రి తనయుడితో హెడ్ కానిస్టేబుల్