ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు నెల్లూరు జిల్లా వన్నురుపాడు గ్రామానికి చెందిన బోగిరెడ్డి చంద్రారెడ్డి, నాగేశ్వరరావుగా గుర్తించారు. వీరు తెలంగాణ నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి ప్రకాశం జిల్లాలోని కట్టక్రిందపల్లి గ్రామంలో విక్రయిస్తుండగా దాడుల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి 884 మద్యం బాటిళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో కనిగిరి ఎస్ఈబీ అధికారులు, మార్కాపురం సూపరింటెండెంట్ ఎ.ఆవులయ్య పాల్గొన్నారు.
ఇవీ చదవండి