అమరావతి రైతులకు మద్దతుగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు సంఘీభావ దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పెద్ద ఎత్తున తేదేపా శ్రేణులు పాల్గొన్నాయి. భౌతికదూరం పాటిస్తూ..నల్లజెండాలతో ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. "అమరావతే ముద్దు-మూడు రాజధానులు వద్దు" అంటూ నినాదాలు చేశారు.
రియల్ ఎస్టేట్ కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు అప్సర శ్రీను ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు.