ETV Bharat / state

ఒంగోలు మహానాడు తీర్మానాలకు తెదేపా పొలిట్ బ్యూరో ఆమోదం - ఒంగోలు మహానాడు తీర్మానాలకు తెదేపా పొలిట్ బ్యూరో ఆమోదం

ఒంగోలులో నేటి నుంచి జరగనున్న తెదేపా మహానాడు తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం చొప్పున మెుత్తం 17 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

ఒంగోలు మహానాడు తీర్మానాలకు తెదేపా పొలిట్ బ్యూరో ఆమోదం

author img

By

Published : May 27, 2022, 12:38 AM IST

ఒంగోలులో జరిగిన తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం ముగిసింది. నేటి నుంచి ఒంగోలులో తెదేపా మహానాడు జరగనుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 17 తీర్మానాలు చేశారు. వీటిలో ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం ఉంది. రాజకీయ తీర్మానంపై పొలిట్‌ బ్యూరోలో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.

వైకాపా బస్సు యాత్రపై పొలిట్‌ బ్యూరోలో ప్రస్తావన వచ్చింది. బస్సు యాత్ర ఓ డ్రామా అంటూ చర్చ జరిగింది. వైకాపా 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రెడ్డి వర్గం వారేనని నేతలు గుర్తుచేశారు. లాబీయింగ్‌ చేసేవారికి రాజ్యసభ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవట్లేదని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ఈ భేటీలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కళా వెంకట్రావు ప్రస్తావించారు. ఎంబీసీ నుంచి కొత్తవారికి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు.

ఇక ఇప్పటికే ఒంగోలు పసుపువర్ణ శోభితం అయింది. మహానాడుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. పలు జిల్లాల నుంచి కార్లు, ద్విచక్రవాహనాలపై కార్యకర్తలు భారీగా ఒంగోలుకు చేరుకుంటున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.