ETV Bharat / state

పాతకక్షలతోనే తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై దాడి - తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై దాడి తాజా వార్తలు

రాష్ట్రంలో సంచలనం రేపిన తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పాతక్షక్షలే దాడికి కారణమని దర్శి డీఎస్పీ వెల్లడించారు. ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని తేల్చిచెప్పారు.

పాతకక్షలతోనే తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై దాడి

author img

By

Published : Nov 24, 2020, 6:43 PM IST

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి సాగర్‌ వద్ద తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై జరిగిన దాడి కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పాతకక్షలే దాడికి కారణమని దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు వెల్లడించారు. గ్రామ సచివాలయ ఉద్యోగం విషయమై గతంలోనూ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగిందన్నారు. హత్యాయత్నానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని...దాడి రెండు కుటుంబాలకు సంబంధించినదని వెల్లడించారు. నిందితులు జాడ వెంకటేశ్వర్లు, జాడ వీరాంజనేయులు, జాడ వెంకట్రావు, జాడ శ్రీనివాస రావు, జాడ గోపి, కొనికి యోగయ్యలను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించామన్నారు.

ఏం జరిగిందంటే...

సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామానికి చెందిన బి.కృష్ణయ్య, జి.వీరాస్వామి, మరొకరు కలిసి నవంబర్​ 22న కొమ్మాలపాడు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన కొందరు మామిళ్లపల్లి కాలువ వద్ద మాటేసి..వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. కృష్ణయ్య, వీరాస్వామిల శరీరాల నుంచి కాళ్లు, చేతులు దాదాపు వేరయ్యేంతగా తీవ్రంగా కొట్టారు. మూడో వ్యక్తి మాత్రం చిక్కకుండా పారిపోయాడు. అదే సమయంలో అటుగా కొందరు రావడంతో దుండగులు పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.

ఇదీచదవండి

తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.