ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్యే క్వారీ లీజులు రద్దు చేసిన మైనింగ్ శాఖ

author img

By

Published : Aug 26, 2020, 8:47 PM IST

తెదేపా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​కు చెందిన క్వారీల లీజులను మైనింగ్ శాఖ అధికారులు రద్దు చేశారు. గురిజేపల్లి, బల్లికురవ, చీమకుర్తి ప్రాంతంలో రవికుమార్, వారి సన్నిహితులకు చెందిన 14 క్వారీల లీజులను రద్దు చేసినట్లు మైనింగ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Tdp MLA is the mining department that canceled the quarry leases
తెదేపా ఎమ్మెల్యే క్వారీ లీజులను రద్దు చేసిన మైనింగ్ శాఖ

ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమలపై రాజకీయ ప్రభావం.. వాటి నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లాలో ప్రసిద్ధి చెందిన గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్ల లీజుదారుల్లో రాజకీయ ప్రాబల్యం ఉన్నవారు అధికంగా ఉన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా, ఉన్నత పదవులు అలంకరించిన నేతలు నిర్వహిస్తున్న క్వారీలు, పాలిషింగ్ యూనిట్లతో.. రెండేళ్ల కిందట వరకు వ్యాపారం సజావుగా సాగింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి. క్వారీల్లో ఎన్​ఫోర్స్​మెంట్ దాడులు నిర్వహించి, అక్రమాలు జరిగాయంటూ వందల కోట్ల రూపాయల పెనాల్టీలు కట్టాలని నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసులు అందుకున్న వారిలో అత్యధికులు ప్రతిపక్షాలకు చెందినవారే ఉన్నారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు వంటివారు ఉన్నారు. ఇందులో అత్యధిక క్వారీలు, పెద్ద పాలిషింగ్ యూనిట్ ఉన్న శిద్దా కుటుంబీకులవే. ఆయన వైకాపాలో చేరారు. ఇప్పుడు తాజాగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా వీరిద్దరికి చెందిన 14 క్వారీల లీజులు రద్దు చేశామంటూ గనుల శాఖ నోటీసులు జారీచేసింది.

ప్రతిపక్ష నేతలే టార్గెట్..!

ప్రతిపక్షాలకు చెందిన ఈ క్వారీల లీజు రద్దు విషయమై చర్చ సాగుతోంది. వారి ఆర్ధిక మూలాల మీద దెబ్బతీసే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా అధికారంలో వచ్చిన తరువాత జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వారీల్లో 106 లీజుల్లో అక్రమాలు జరిగినట్లు, ఆయా సంస్థలు 2వేల 520 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని విజిలెన్స్ , ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.. ఇందులో కొంతమంది హై కోర్టుకు వెళ్లారు.. ఈ వ్యవహారం ఇలా ఉండగా దేశం నాయకులకు చెందిన 14 లీజులు రద్దు చేశారు. కేవలం రాజకీయ కక్షల కారణంగానే... రద్దు నోటీసులు జారీ చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు.

ఇవీ చదవండి:

ఓటేసిన వారినే జగన్ కాటేస్తున్నారు: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.