TDP CHEIF CHANDRABABU PARYATANA UPDATES: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నేడు ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో నేడు మార్కాపురంలో ఆయన బస చేసే ప్రాంతాలను, బహిరంగ సభలు నిర్వహించే ప్రాంతాలను టీడీపీ నేతల బృందం పరిశీలించింది.
మూడు నియోజకవర్గాల్లో... టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురంలో ఆయన బస, బహిరంగ సభ ప్రాంతాలను ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామితో పాటు కందుల నారాయణరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, దామచర్ల జనార్దన్ పరిశీలించారు.
జన్మదిన వేడుకలు ఇక్కడే.. అనంతరం 20వ తేదీన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మార్కాపురంలోని జరుపుకోనున్నట్లు నేతలు తెలిపారు. స్థానిక సాయి బాలాజీ పాఠశాలలో చంద్రబాబు బస, ఎస్వీకేపి కళాశాలలో బహిరంగ సభ స్థలాన్ని వారు పరిశీలించారు. చంద్రబాబు పర్యటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఖండించారు. గత నాలుగేళ్లుగా మంత్రిగా మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రాంతంలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని.. మీరు సిద్ధమా అంటూ సురేష్‌కు నారాయణరెడ్డి సవాల్ విసిరారు. తమ అధినేత ప్రకాశం జిల్లాలో పర్యటన చేయడం తమ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమని వ్యాఖ్యానించారు. ఈ మూడు పర్యటనలో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల గురించి, ప్రజల గోడును, ఆవేదనను చంద్రబాబు నాయుడికి వివరిస్తామని తెలిపారు.
నాలుగేళ్లు ఏం చేశారో చెప్పండి.. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. చంద్రబాబు నాయుడు దేనికోసం జిల్లాలో పర్యటిస్తున్నారని పదే పదే ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు మంత్రి పదవులు ఎందుకున్నాయో మాకు అస్సలు అర్థం కావటం లేదు. మీరు ఈ నాలుగేళ్ల కాలంలో ఈ జిల్లా అభివృద్ది కోసం ఏం చేశారో చెప్పండి. కనీసం సీసీ రోడ్లు వేయించలేని దుస్థితిలో మీరు, మీ ప్రభుత్వ పాలన' ఉందంటూ వైసీపీ మంత్రులపై టీడీపీ నేతలు మండిపడ్డారు.
ఇవీ చదవండి