ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలోని భావనారాయణస్వామి ఆలయంలో వరసగా మూడోరోజు అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. లేలేత సూర్య కిరణాలు కాంతిని విరజిమ్ముతూ స్వామి వారి మూలవిరాట్టును తాకాయి. భానుడి కిరణాలు తాకి ఆ ఛాయలో మెరిసిపోయిన భావనారాయణస్వామిని చూసిన భక్తులు పరవశించిపోతున్నారు. ఈ దృశ్యం సోమవారం ఉదయం 6 గంటల నుండి 6.30 గంట వరకు ఈ సమయంలో ఆవిష్కృతమైంది. ఏటా మార్చి, అక్టోబర్ మొదటి వారాల్లో మాత్రమే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వామి వారిని తాకుతాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయాధికారులు చర్యలు చేపట్టారు.
దేవాలయాన్ని ఆగమ శాస్త్ర పండితులు వాస్తు, ఖగోళ శాస్త్రాలను సమ్మేళనం చేసి నిర్మించినట్లు అక్కడున్న రాతి శాసనాల ద్వారా తెలుస్తోంది. గాలి గోపురం నుంచి సుమారు 100మీటర్ల దూరంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న ముఖద్వారం నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామిని మహా పాద మస్తకం వరకు తాకడం ఇక్కడ విశేషం. వాతావరణం అనుకూలంగా ఉంటే బుధవారం వరకూ సూర్యకిరణాలు స్వామిని తాకుతాయని అర్చకులు తెలిపారు .
ఇదీ చదవండి