ఈనెల 7న ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం ఈదుమూడులో తలపెట్టిన. ' మాదిగ ఆత్మగౌరవ జాతర' మహాసభను విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని మాదిగ సామాజిక వర్గమంతా హాజరవ్వాలని కోరారు. ఆత్మన్యూనత వీడి ఆత్మగౌరవాన్ని సాధించే దిశగా ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించామని వెల్లడించారు.
ఇవీ చదవండి...మమ్మల్ని విస్మరించారు.. అందుకే ఓడారు!: మందకృష్ణ