ప్రకాశం జిల్లా ఒంగోలు క్విజ్ ఇంజినీరింగ్ కళాశాల బిటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఫీజ్ రీయిబర్స్మెంట్ నిధులు ఇంకా రాని కారణంగా.. తమను పరీక్షలు రాసేందుకు యాజమాన్యం అనుమతించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను పరీక్షలకు అనుమతించాలని విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.
2016 లో కళాశాల లో చేరిన తమకు చివరి సంవత్సరం ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామంటున్నారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక తల్లి దండ్రులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎక్కడి నుంచి ఫీజులు తెచ్చి కట్టగలమని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి తమకు హాల్ టికెట్ ఇప్పించి, పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: