ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మోటుపల్లి గ్రామంలో పొట్టేళ్ల మందపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 24 పొట్టేళ్లు మృతి చెందాయి. గ్రామానికి చెందిన పొట్టేళ్ల యజమాని గురవయ్య.. మధ్యాహ్న సమయంలో పొట్టేళ్లను గ్రామా సమీపంలో ఉన్న దొడ్డిలో తొలి భోజనానికి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో దొడ్డి వద్ద కాపలా లేని పొట్టేళ్ల మందపై.. వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో 24 పొట్టేళ్లు అక్కడికక్కడే మృతి చెందాయి.
భోజనానంతరం గురవయ్య.. పొట్టేళ్ల దొడ్డి వద్దకు వెళ్లి చనిపోయిన పొట్టెళ్లను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుక్కల దాడిలో సుమారు రూ1.5 లక్షల నష్టం వాటిల్లిందని గురవయ్య వాపోయాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:
'మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు.. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్