ఒంగోలులో హోరాహోరీగా రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు మూడో రోజుకు చేరుకున్నాయి. మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల జట్లు సెమీ ఫైనల్స్లో తలపడగా తూర్పుగోదావరి జిల్లా జట్టు ఫైనల్కు చేరుకుంది. ఉత్సాహంగా సాగిన పోటీలను వీక్షించేందుకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. పోటీలు వీక్షించేందుకు అధిక సంఖ్యలో క్రీడాభిమానులు హాజరయ్యారు.
హోరాహోరీగా సాగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు