దళిత విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని తెదేపా శాసనసభాపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ఎస్సీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళిత విద్యార్థులకు అమల్లో ఉన్న పథకాలను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేడ్కర్ విదేశీ విద్య పథకాలను ఇప్పటికే రద్దు చేసిన సీఎం జగన్... తాజాగా పీజీ విద్యార్థులకు బోధనా రుసుములు, మెస్ ఛార్జీలు ఇవ్వకుండా దళిత ద్రోహిగా మిగిలారని విమర్శించారు. గతంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాలుగు జతల యూనిఫామ్లు ఇస్తే, జగనన్న విద్యాకానుకలో మూడు జాతలకే కుదించారని బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులు మొదలై రెండు నెలలైనా ఇంత వరకూ జత యూనిఫామ్ కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.
ఇదీ చదవండి