అరుదుగా ఉండే నక్షత్ర తాబేళ్లు ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రత్యక్షమయ్యాయి. సాయిబాబా దేవస్థానం సమీపంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటి ముందు చెట్లు తొలగిస్తుండగా తాబేళ్లు కనిపించాయి. వాటిని శ్రీనివాసరావు ఇంటికి తెచ్చి అద్దంకి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సహజంగా అటవీ ప్రాంతంలో సంచరించే ఈ అరుదైన తాబేలు పట్టణ ప్రాంతంలో కనిపించడంతో ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. నక్షత్ర తాబేళ్లకు ఇతర రాష్ట్రాల్లో , ఇండోనేషియా వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి ఇంటిలో ఉంటే సకల సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం.
ఇదీ చూడండి. అచ్చెన్నపై అనిశా ప్రశ్నల వర్షం... ఇవాళ, రేపు కొనసాగనున్న విచారణ