ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 66వ వార్షిక తిరునాళ్లు 3 రోజులపాటు జరగనున్నాయి. ధ్వజ దండం నందు ఉష్ణ పతాకావిష్కరణ కార్యక్రమానికి దేవస్థానం వేద పండితులు, కార్యనిర్వహణాధికారి, సభ్యులు పాల్గొన్నారు. వేదమంత్రాల మధ్య పతాకాన్ని ఆవిష్కరించారు. తిరునాళ్లలో భాగంగా నేడు దేవస్థానం నందు ఉత్సవ ప్రారంభం, గణపతి పూజ, అఖండ స్థాపన, గజవాహన సేవ కార్యక్రమం చేపట్టారు.
ఇవీ చదవండి