ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో నాటుసారా తయారీదారులపై పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 2000 వేల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేసారు. ఇటువంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: క్యాన్సర్ మాస ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం