ETV Bharat / state

Sea deaths: ఆహ్లాదం సరే... అజాగ్రత్తగా ఉంటే..

Sea deaths: సముద్రం.. ఒడ్డున కూర్చుంటే ఎంతో ఆనందం, ఆహ్లాదం ఇస్తుందో.. అజాగ్రత్తగా ఉంటే.. అదే స్థాయిలో ప్రమాదం కొని తెచ్చిపెడుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తీరప్రాంతంలో ఇటీవలి కాలంలో ఎన్నో దుర్ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సరైన భద్రత, సిబ్బంది లేకపోవడంతో.. ఏటా పదుల సంఖ్యలో యువకులు గల్లంతవుతున్నారు.

Sea deaths
సముద్ర తీరార తీరని శోకం
author img

By

Published : Jul 5, 2022, 10:42 PM IST

Updated : Jul 7, 2022, 8:03 PM IST

PRATHIDWANI

Sea deaths: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, రామాపురం, చినగంజాం, కనపర్తి, కొత్త పట్నం, రామాయపట్నం బీచ్‌లున్నాయి. 102 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇవన్నీ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటుంటాయి. ఆదివారమైతే ఆ తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ తీర ప్రాంతంలో మెరైన్‌ సిబ్బంది కొరత వేధిస్తోంది. దాదాపు 140 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. అందులో సగం మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. గస్తీ నిర్వహణ, హెచ్చరిక బోర్డుల ఏర్పాటులో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన భద్రత లేకపోవడం వల్ల.. ప్రతి ఆదివారం ఒకటి, రెండు ప్రమాదాలు సాధారణమైపోయాయి. మూడేళ్ళలో పదుల సంఖ్యలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 70మందిని పోలీసులు, స్థానిక మత్స్యకారులు రక్షించారు. పర్యవేక్షణతో పాటు.. భద్రతా ఏర్పాట్లు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ప్రమాదం ఉన్న ప్రాంతాలపైన అవగాహన కల్పిస్తున్నామని.. కొత్తపట్నం మెరైన్ పోలీస్టేషన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఏడాది కాలంలో కొత్తపట్నం పరిధిలో 12 సంఘటనలు జరిగాయని... అందులో 10 మంది వరకు రక్షించామని అంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 7, 2022, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.