ETV Bharat / state

మాతృభాషకు.. మాస్టారు వందనం - ongole news

చిన్నారుల చేత అక్షరాలు దిద్దించడంతో ప్రారంభమైన తన వృత్తిపై ఆ ఉపాధ్యాయుడు ఎనలేని మక్కువ ఏర్పరుచుకున్నారు. కొత్తగా నిర్మించుకున్న ఆయన నివాసానికి ఆ అక్షరాలనే పేరుగా పెట్టుకున్నారు.

కొత్త ఇంటికి మాస్టారు 'అ ఆ' లు..
కొత్త ఇంటికి మాస్టారు 'అ ఆ' లు..
author img

By

Published : Oct 17, 2021, 2:27 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో నివాసముంటున్న ప్రసాద్‌.. కరవది ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తొలుత ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరిన ఆయన.. వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ తీసుకుని ఉద్యోగోన్నతి పొందారు.

కొత్త ఇంటికి మాస్టారు 'అ ఆ' లు..

అయితే.. చిన్నారుల చేత 'అ, ఆ'లు దిద్దించడంతో ప్రారంభమైన తన ఉపాధ్యాయ వృత్తిపై.. మాతృభాషపై ఆయన ఎనలేని మమకారం పెంచుకున్నారు. అందుకే.. తెలుగులోని మొదటి రెండు అక్షరాలైన 'అ, ఆ'లను.. హైదరాబాద్ లో నిర్మించిన తన కొత్త ఇంటి ముందు ప్రత్యేకంగా చెక్కించారు. బంగారపు వర్ణంలోని అక్షరాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇందుకు దాదాపు పాతిక వేల రూపాయలు ఖర్చు అయిందట. భాషపై మక్కువతో ప్రసాద్ చేసిన ఈ పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.

'' భాష మీద మక్కువతోటి మా ఇంటికి 'అ ఆ' అని పేరు పెట్టాను. ఇలా చేస్తే.. నిరక్షరాస్యులు సైతం చదువు వైపు ఆకర్షితులు అవుతారని అనుకున్నాను. పిల్లలు కూడా తెలుగు భాష వైపు మక్కువ పెంచుకునేందుకు దోహదపడుతుందని అనిపించింది.'' - ప్రసాద్, ఉపాధ్యాయుడు

ఇదీ చదవండి:

విద్యుత్ కోతలపై దుష్ప్రచారం.. వారిపై కఠిన చర్యలుంటాయ్: బాలినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.