ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో మొదటి దశలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పాలపర్తి అలేఖ్య సర్పంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే కౌంటింగ్ అనంతరం పాలపర్తి అలేఖ్య.. 80 ఓట్లతో మెజార్టీతో గెలుపొందిదని రిటర్నింగ్ అధికారి ప్రకటించారని.. పది నిమిషాలు తర్వాత గెలిచింది పాలపర్తి అలేఖ్య కాదు.. జయమ్మ అని అన్నారని అలేఖ్య పేర్కొన్నారు.
ఇదేంటని ప్రశ్నిస్తే మీరు లోపలికి రావద్దని బయటకి నెట్టేసి క్రిమినల్ కేసు పెడతామని బెదిరించారని ఆలేఖ్య ఆరోపించారు. రీ కౌంటింగ్ నిర్వహించి న్యాయం చేయాలని ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పలువురు గ్రామస్థులు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది