ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి ఆర్టీసి బస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి బస్సుల రాకపోకలకు ప్రభుత్వం అనుమతించగా.. ఒంగోలు కంటైన్మెంట్ జోన్లో ఉండటం వల్ల రాకపోకలు నిలిపివేశారు. ఫలితంగా.. ఇతర ప్రాంతాల నుంచి ఒంగోలు మీదుగా వెళ్ళాల్సిన బస్సులు పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డుమీద నుంచి వెళ్ళిపోయేవి. మంగళవారం నుంచి అధికారులు కొన్ని జాగ్తత్తలతో ఒంగోలు నుంచి కూడా బస్సులు నడుపుతున్నారు.
విజయవాడ, అద్దంకి, చీరాలకు వెళ్ళే బస్సులు ఒంగోలు శివారున ఉన్న మంగమ్మ కళాశాల వద్ద, నెల్లూరు వైపు వెళ్ళే బస్సులు నెల్లూరు రోడ్డులో ఉన్న మినీ స్టేడియం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. బస్టాండ్ లోకి, పట్టణం లోకి మాత్రం బస్సుల రాకపోకలను అనుమతించడం లేదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
డ్రైవర్లు ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎవరైనా కరోనా బాధితులు ఉన్నారనే విషయం పరీక్షించి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించే విధంగా పరిమిత సంఖ్యలో ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నారు.
ఇదీ చదవండి: