ఒంగోలులో ఆర్టీసి కార్మికులసమావేశం జరిగింది. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వినర్ దామోదర్ పాల్గొన్నారు. యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సంఘాలకు పనేమిటని ఎండీ ప్రశ్నిస్తున్నారని, చట్టప్రకారం జరిగిన ఎన్నికల్లో ఎన్నికయిన సంఘాలను ప్రశ్నించడం న్యాయం కాదని అన్నారు. ఆర్టీసి విభజన సమయంలో 12 వేల 500 బస్సులు ఉండగా, 64వేల మంది కార్మికులు ఉండేవారని, ఇప్పుడూ అవే బస్సులు ఉండగా 52వేల మంది కార్మికులకు దిగజారిందని, అందువల్ల ఉన్నవారికి పనిభారం పెరుగుతోందని తెలిపారు. ఆర్టీసీ అప్పులు తీర్చాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ప్రభుత్వం కల్పించుకొని తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే జూన్ 13 నుంచి సమ్మె తప్పదని దామోదర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి.