తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. ఒంగోలులో ఆర్టీసీ ఒప్పంద కార్మికులు ధర్నా నిర్వహించారు. అక్రమంగా రిలీవ్ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని.. ప్రకాశం జిల్లా ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
అన్ని రూట్లలో సర్వీసులు పునరుద్ధరించాలని.. తమ వినతులను పరిగణలోకి తీసుకోవాలని ఒప్పంద కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. పరష్కరించాలంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: కాలం చెల్లిన మందులు... బలైన పసిపాప ప్రాణాలు