కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలనులో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండగా.. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్పూరు సమీపంలో రామిరెడ్డి పాలెం వద్ద కూలీల ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కూలీ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: