ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని రెండు గ్రామాల్లో పదిమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దేనువుకొండ గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు ఓడిపోవడానికి వాలంటీర్లే కారణమంటూ... వారిని తొలగించారని గ్రామస్తులు మండిపడ్డారు. వాలంటీర్లను తొలగించడానికి కారణాలేంటో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రేపు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఉక్కు’ ఉద్యమం