ప్రకాశం జిల్లాలో 2008 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు.. నియామక పత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేశారు. 109 పోస్టులకు గాను ఈ నియామక ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో దాదాపు 250 మంది 2008లో క్వాలిఫై అయినప్పటికి, 125 మంది వరకే విల్లింగ్ చూపించడంతో వెరిఫికేషన్ అనంతరం.. 109 పోస్టుల్లో వీరిని భర్తీ చేశారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో ఎక్కువ ఖాళీలు ఉండటంతో ఎక్కువ మందిని అటువైపే నియమించారు. అయితే జిల్లాలో మిగతా చోట్ల కూడా ఖాళీలు ఉన్నా.. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో నియమిస్తున్నారంటూ నూతన ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం యధావిధిగా నియమిక ప్రక్రియ నిర్వహించారు.
ఇదీ చదవండి:
CM Jagan visiting Polavaram: ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్!