ETV Bharat / state

కర్నూలులో అరెస్ట్...ప్రకాశం జిల్లాలో పట్టుబడిన రేషన్ బియ్యం - ration rice illeagal transport in prakasam dst

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా రేషన్ తరలిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే ప్రకాశం జిల్లాలో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం.

ration rice seized in prakasamd dst yerragondapalem

author img

By

Published : Jun 6, 2020, 4:34 PM IST

పక్కా సమాచారంతో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని ఓ మిల్లులో కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ పట్టుకున్నారు.

కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఏకలవ్యనగర్​లో సోదాలు నిర్వహించి 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా..అక్కడ పట్టుకున్న నిందితులు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని వెంకటసాయి రైస్ అండ్ డాల్ మిల్లుకు పీడీఎస్ రేషన్ బియ్యాన్ని చేరవేసినట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు.

ప్రస్తుతం బియ్యాన్ని లారీల్లో స్థానిక ప్రభుత్వ గోడౌన్​కు తరలిస్తున్నామని... ఎక్కువ మొత్తంలో బియ్యం ఉన్నందున సోదాలు పూర్తిచేసి మిగతా విషయాలు వెల్లడిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి

అర్హులైన పేదలకు అన్యాయం జరగకూడదు: హోంమంత్రి సుచరిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.