ETV Bharat / state

'వాహన డ్రైవర్లే సరకులు పంపిణీ చేస్తారనడంపై ఆందోళనలో డీలర్లు'

author img

By

Published : Jan 25, 2021, 8:44 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా మద్దతు ఉంటుందని రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అన్నారు. అయితే వాహన డ్రైవర్లే సరకులు పంపిణీ చేస్తారని ప్రచారంతో డీలర్లు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో రేషన్ డీలర్ల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ration dealers meeting at cheerala
వాహన డ్రైవర్లే సరకులు పంపిణీ చేస్తారడం వల్ల ఆందోళనలో డీలర్లు'

రాష్ట్రంలో 29 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారని, ప్రభుత్వం ఏవిధమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అన్నారు. కార్డుదారుల సౌకర్యార్థం.. ఇళ్లకే రేషన్ పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని.. అయితే వాహన డ్రైవర్లే సరుకులు పంపిణీ చేస్తారని ప్రచారంతో డీలర్లు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డీలర్లకు వృత్తి భద్రత కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో చీరాల, పర్చూరు నియోజకవర్గాల రేషన్ డీలర్ల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రేషన్ పంపిణీ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సాక్షిగా హామీ...

జీవో నంబర్ 5 ప్రకారం చనిపోయియిన రేషన్ డీలర్లకు మట్టి ఖర్చు కింద రూ.15 వేల సహాయం చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి భరోసా ఇచ్చారని.. మంత్రి ప్రకటనను అమలు చేయాలని కోరారు. లాక్​డౌన్ కాలనికి సంబంధించి 8 విడతల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు కాటా ఆంజనేయులు, రేషన్ డీలర్ల సమాఖ్య పత్రినిధులు, డీలర్లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: నేటితో ముగియనున్న అడ్మిషన్ల గడువు.. ఇంటర్​ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.