ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి 18వ నంబరు చౌక ధరల దుకాణంలో షాపు డీలరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలన్న ఆలోచనతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీలరు సౌజన్య తెలిపారు.
రేషన్ సరకులు తూకం వేసే చోట, చౌక ధరల దుకాణంలోకి వచ్చి, వెళ్లే మార్గంలో కెమెరాలు అమర్చారు. దుకాణంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పేదలకు సరకులు అందాలనే ఉద్దేశంతో వీటిని అమర్చినట్లు డీలరు తెలిపారు. ఈ ఏర్పాటుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: