ఈ నెల 30న రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయసలహా బోర్డులను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో దాదాపు 20 కేంద్రాలను ఏర్పాటు చేయటానికి అధికారులు భవనాలను సిద్ధం చేశారు. రైతులకుకావాల్సిన విత్తనాలు, ఎరువులు, కావల్సిన ఉపకరణాలు అన్ని ఒకేచోట దొరుకుతాయని అధికారులు అంటున్నారు.
రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలను ఈ కేంద్రాల నుంచి పర్యవేక్షిస్తారు. భూసారపరీక్షలు చేయటానికి చిన్నపాటి ప్రయోగశాల కూడా ఈ రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచుతారు. వ్యవసాయం,పశుసంవర్ధక శాఖ, ఉద్యానశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన అధికారులు ఈ కేంద్రాలలో అందుబాటులో ఉంటారు.
ఇదీ చదవండి : కొవ్వూరులో.. పోలీసులపై వలసకూలీల రాళ్ల దాడి