ETV Bharat / state

'ఎండ మండుతోంది.. పైరు ఎండుతోంది'.. మరో రెండు రోజుల్లో అలా జరగకుంటే..! - Alternative Crop Seeds

Rainfall Conditions Having Severe Impact on Crop Cultivation: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 341 మండలాల్లో వర్షాలు బాగా తక్కువగా కురవడం వల్ల.. దాదాపు అన్ని రకాల పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. కరవు పరిస్థితులు కనిపిస్తున్నందున.. ప్రత్యామ్నాయ పంటల కోసం విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.

Low_Rainfall
Low_Rainfall_Effect_on_Crop_Cultivation
author img

By

Published : Aug 11, 2023, 10:15 AM IST

Rainfall Conditions Having Severe Impact on Crop Cultivation: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండుతున్న వేళ.. ఈ ఏడాది ఖరీఫ్‌ సేద్యం అన్నదాతకు అనుకూలంగా లేదు. సాధారణం కంటే 7 డిగ్రీల వరకు పెరిగి.. చాలా చోట్ల 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నమోదవుతుండగా.. 11 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. సాధారణం కంటే తిరుపతి జిల్లాలో 54.9శాతం, అన్నమయ్య జిల్లాలో 48.4శాతం, నెల్లూరు జిల్లాలో 40 శాతం, వైఎస్సార్​ జిల్లాలో 39.5శాతం తక్కువగా.. వర్షాలు కురిశాయి. రెండు, మూడు రోజుల్లో వానలు కురవకుంటే అన్ని జిల్లాలు సైతం లోటు వర్షపాతం జాబితాలో చేరనున్నాయి.

Crop Loss: ప్రభుత్వ నిర్లక్ష్యం.. నీట మునిగిన వందలాది ఎకరాలు

Low Rainfall in Andhra Pradesh: ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా రాయలసీమలో బోర్లు అడుగంటుతున్నాయి. మిరప నాటుదామన్నా నీరులేదు. మళ్లలో నారు పెరుగుతోంది. ఖరీఫ్‌ మొదలై రెండు మాసాలు దాటినా.. సాధారణ విస్తీర్ణంలో 45 శాతంలోనే పంటలు వేశారు. వేరుసెనగ 40శాతం.. విస్తీర్ణంలోనే సాగైంది. జొన్న, కంది, పత్తి పంటల సేద్యం గణనీయంగా తగ్గింది. ఆగస్టు 9 నాటికి.. రాష్ట్రంలో 58.95లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా.. 38.67లక్షల ఎకరాల్లోనే వేశారు. 20.28లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది.

Farmers Problems: అన్నదాతకు భరోసా ఇవ్వని పంటల బీమా.. ఆవేదనలో రైతన్న

"నీళ్లు లేక కొన్ని పంటలు ఎండిపోయాయి. మిగతా పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఇంజన్లు పెట్టి నీరు తోడుకోవడానికి కూడా బావుల్లో నీరు లేదు. కాలవల్లోనూ నీరు లేదు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలి"-రైతులు

Crop Loss Due to Low Rainfall: గత సంవత్సరం.. ఇదే సమయానికి సాగైన విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి 16.2 లక్షల ఎకరాల్లో తగ్గడం.. పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఖరీఫ్‌ మొదలై 70 రోజులు అవుతున్నా.. సాధారణ విస్తీర్ణంతో చూస్తే ప్రకాశం జిల్లాలో 8శాతం, విశాఖ 8, అనకాపల్లి 10, బాపట్ల 12, YSR 20, విజయనగరం 22.. అన్నమయ్య 24, పల్నాడులో 26, చిత్తూరు 34, శ్రీసత్యసాయి జిల్లాలో 29శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు. సగం జిల్లాల్లో సాగు విస్తీర్ణం 50శాతంలోపే ఉంది. రాయలసీమ.. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మిరప మొలకలు వాడిపోతున్నాయి. పల్నాడులో బెట్ట వాతావరణం కారణంగా.. వరి నారుమళ్లు కూడా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Free Crop Insurance: గందరగోళంగా పంటల బీమా.. తీరని అన్యాయం జరిగిందంటున్న రైతుల

Farmers Demand to Provide Alternative Crop Seeds: ఆశించిన వానలు లేనందున.. ప్రత్యామ్నాయ పంటల దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉండగా.. అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. వరి, మినుము, పెసర, కొర్ర మాత్రమే 80శాతం రాయితీపై ఇస్తామంటోంది. ఆగస్టు వరకు చూసి.. తర్వాత ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు ప్రారంభిస్తామని ఇటీవల సీఎస్‌ నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. 10 వేల క్వింటాళ్ల మినుము.. కంది, పెసర, జొన్న, ఉలవ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఇస్తామని వివరించారు. ముందే విత్తనాలిస్తే.. వర్షాలు అనుకూలించగానే వేసుకోవచ్చని రైతులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.