ETV Bharat / state

మంజూరైన ఇళ్లు రద్దు చేశారని లబ్ధిదారుల ఆందోళన

గత ప్రభుత్వ హయంలో మంజూరైన జీప్లస్‌-3 గృహాలను రద్దైనట్లు వాలంటీర్లు చెబుతున్నారని ప్రకాశం జిల్లా ఒంగోలులో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను ప్రతిపక్ష పార్టీకి చెందినవారిగా ముద్రవేసి జాబితాలో తమ పేర్లను తొలగిస్తున్నారని.. గ్రామ వాలంటీర్లు బలవంతంగా సంతకాలు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

author img

By

Published : Jul 6, 2020, 3:57 PM IST

తమకు మంజూరైన ఇళ్లను రద్దు చేశారని లబ్ధిదారుల ఆందోళన !

ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ప్రభుత్వ హయంలో మంజూరైన జీప్లస్‌-3 గృహాలు రద్దైనట్లు వాలంటీర్లు చెబుతున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు చెల్లించి గృహాల కోసం ఎదురు చూస్తుంటే రద్దు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. చింతల సమీపంలో జీ ప్లస్‌-3 అపార్టుమెంట్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయంలో దరఖాస్తు చేసుకోగా... తమకు మంజూరయ్యాయన్నారు. కేటగిరీలను బట్టి కొంత సొమ్ము కూడా డిపాజిట్‌ చేశామని నిర్మాణాలు పూర్తైనా.., ప్రభుత్వం మారిన తరువాత ఇళ్ల కేటాయింపు జరపలేదన్నారు.

తమను ప్రతిపక్ష పార్టీకి చెందినవారిగా ముద్రవేసి జాబితాల్లో తమ పేర్లను తొలగిస్తున్నారని.. గ్రామ వాలంటీర్లు వచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఒంగోలు ఆర్డీవో ప్రభాకర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ నిరంజన్‌ రెడ్డిలు లబ్దిదారులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అర్హుల పేర్లు తొలగించబోమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.