ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండపలెంలోని నెహ్రు యువ కేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా మహమ్మారి వలన గత 5 నెలల నుంచి పాఠశాలలు, కళాశాలలు మూతపడినందున తమ జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. జీతాలు లేక కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు పనిచేసిన కాలానికే జీతాలు అందించి.. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక వర్గాలకు ఆసరాగా ఆర్థిక సాయం చేసిన విధంగానే తమనూ ఆదుకోవాలని ప్రైవేట్ ఉపాధ్యాయులు కోరారు.
ఇవీ చదవండి : కరోనాతో ఇద్దరు మృతి..అప్రమత్తమైన అధికారులు