కరోనా భయంతో అత్యవసర చికిత్సలను ప్రైవేట్ వైద్యులు నిరాకరించడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నిండు గర్భిణి నాగలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. 9 నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో దగ్గరలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా వైద్యం చేయడానికి డాక్టర్లు నిరాకరించారు.
అక్కడ పరీక్షిస్తే కరోనా లేదు..
బాధితురాలు, ఆమె బంధువులు చేసేదేమీ లేక వైద్యశాల ఎదురుగా రోడ్డుపైనే మిన్నకుండిపోయారు. ఈ దయనీయ పరిస్థితిని గమనించిన స్థానికులు.. తహసీల్దార్‌కు విషయాన్ని చేరవేశారు. స్పందించిన తహసీల్దార్ పుల్లారావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ధ్రువీకరించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి