ఎగువన కురిసిన వర్షాలకు ఈ ఏడాది రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండాయి. రైతన్నలు ఊపిరి పీల్చుకొని సాగుకు సమాయత్తమయ్యారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించలేదు. వరి సాగుకు నీరు వస్తుందనే భరోసాతో నారుమళ్లుసిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఉన్నతధికారులు, కలెక్టర్ సాగు నీరు ఆరుతడులకే మాత్రమే వస్తుందని అన్నారు. కానీ రైతులు మాత్రం వరి నారుమళ్లు ఏర్పాటు పనులు వేగంగా చేస్తున్నారు.
ఇదీ చదవండి:రాజధానిలో ఆగని రైతుల ఆందోళనలు