ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. వెలిగండ్ల, కంభం, మార్కాపురం, బెస్తవారిపేటలో పిడుగులు పడే ప్రమాదం ఉందని వెల్లడించింది. తర్లుపాడు, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, కనిగిరి, పెదచెర్లోపల్లి, పామూరు, చంద్రశేఖరపురం, వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరులో పిడుగులు పడే అకాశముందని తెలిపింది. కొండాపురం, ఉదయగిరిలో మండలాల పరిసరాల్లో పిడుగులు ఎక్కువగా పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రాంతాల్లో ఉండవద్దని సూచించింది. సురక్షిత భవనాల్లోనే ఆశ్రయం పొందాలని విపత్తుశాఖ కమిషనర్ సూచించారు.
ఇదీ చదవండీ... తిరుపతి రుయా ఘటన: 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం